110కి చేరిన కల్తీ మృతుల సంఖ్య

గౌహతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): అసోంలో కల్తీమద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 110కి చేరింది. 341 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక్క గోల్‌ఘాట్‌ జిల్లాలోనే 59 మంది మృతి చెందగా, జోర్‌హాట్‌ జిల్లాకు చెందిన వారు 45 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ తీవ్ర దిగ్భాం/-రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, అస్వస్థతకు గురైన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజావార్తలు