1116 కిలోల లడ్డు తయారీ ప్రారంభించిన ఎమ్మెల్యే నరేందర్
కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం శ్రీ భద్రకాళి పరపతి సంఘం ఆధ్వర్యంలో 1116 కిలోల లడ్డు మహా ప్రసాదమును సోమవారం రోజున సాయంత్రం గంటలకు వర్తక సంఘం గణనాథులకు సమర్పిస్తున్నారు 1,116 కిలో లడ్డు తయారీ కి ముఖ్యఅతిథిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ గారు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినారు. వర్తక సంఘం వారు ఏర్పాటు చేసిన గణనాధునికి కూడా కొబ్బరికాయ కొట్టినారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి. 20 డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్. 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ లత భాస్కర్. మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి. లడ్డు తయారు చేసి గణనాధికి సమర్పిస్తున్న బాంబుల కుమార్. గోరంట్ల మనోహర్.వేముల నాగరాజు. మాటేటి విద్యాసాగర్. ఓం ప్రకాష్ కొలారియా. మండల శ్రీరాములు. వడిచెర్ల సదానందం. వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు.శ్రీ భద్రకాళీ పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు. లక్ష్మీ గణపతి పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు.కాశీబుగ్గ మిత్రమండలి తదితరులు పాల్గొన్నారు.