ఊచకోతకు పాల్పడేవారు బౌద్ధులు కారు
– రొహింగ్యాల మారణహోమంపై మండిపడ్డ దలైలామా
– ఖండించిన ఐరాస
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 11,(జనంసాక్షి):మయన్మార్‌లో రొహింగ్యా ముస్లింలపై సాగుతున్న ఊచకోతను టిబెట్ బౌద్ధమతగురువు దలైలామా ఖండించారు. బౌద్ధం హింసను ఎపుడూ ప్రొత్సహించదని మయన్మార్‌లో సాగుతున్న మారణకాండను ఆయన తప్పుపట్టారు. నిరుపేదలైన రొహింగ్యా ముస్లింలకు మయన్మార్ సన్యాసులు నిజమైన బౌద్ధులు కనుక అయ్యుంటే వారికి సాయమందించే వారన్నారు. పౌరసత్వాన్ని ఇచ్చి అక్కున చేర్చుకునే వారన్నారు. మీ చర్యలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని, ఇది విషదకరమైన ఘటనలని దలైలామా ఖండిం చారు.
రోహింగ్యాలపై దాడిని ఖండించిన ఐరాస
మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడిని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. రోహింగ్యాలపై మయన్మార్‌లో జరుగుతును దాడులపై ఐరాస మండిపడింది. ఒక జాతిపై కక్ష గట్టినట్టు జరుగుతున్న దాడులకు అందరూ సిగ్గుపడాలని సమితి హ్యూమన్ రైట్స్ చీఫ్ జైదీ ఆల్ హసన్ అన్నారు. మయన్మార్‌లో యధేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.