12 నుంచి సాహిత్య కార్యక్రమాలు

ఖమ్మం, డిసెంబర్‌ 11 (: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 19 వరకు జిల్లా స్థాయిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. మండల స్థాయి పోటీల్లో మొదటగా నిలిచిన ఓ విద్యార్థిని జిల్లా స్థాయికి పంపాలని ఎంఈవోలకు అధికారులు సూచించారు. సాహిత్య కార్యక్రమాలు ఖమ్మం పట్టణంలోని టిటిడిసి భవనంలో జరుగుతాయన్నారు. ఈ నెల 12న తెలుగు భాష వికాసం అనే అంశంపై వ్యాస రచన, పల్లెజీవనం- పల్లె, వృత్తులు అంశంపై చిత్రలేఖనం, 13న దాశరధి శతకం లేదా ఏదైన సుభాషితం, పద్య పటణ పోటీలు జరుగుతాయని తెలిపారు. 14న నాకు నచ్చిన తెలుగు కవి- అతని కవిత్వంపై వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు. 16న కంచర్ల గోపన్న కవితలు, రచనలు, 17న సాహిత్య గోష్ఠి, 18న కవి సమ్మేళనం, 19న ఖమ్మం చరిత్ర సంస్కృతులపై చర్చా గోష్ఠి నిర్వహిస్తున్నామన్నారు.  భక్తరామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 16 నుంచి 19 వరకు కళా ప్రదర్శనలు, కళా రూపాలు వివిధ కళలపై ప్రదర్శిస్తారన్నారు.