12 శాతం మైనారిటీ రిజర్వేషన్‌ ఏమైంది!?

4

– ఎంఐఎం మౌనమేళానోయి…

– పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

‘మైనార్టీలకు రిజర్వేషన్ల హావిూ ఏమైంది’

హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ల హావిూ ఏమైందని తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌ రావును టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఎంఐఎం ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు. హైదరబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్‌

హైదరాబాద్‌ ఎన్నికలను నిష్పాక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని ఉత్తమ్‌ తెలిపారు. భావ సారూప్యత ఉన్న పార్టీలతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల వారికే టిక్కెట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. కాగా గ్రేటర్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్ధమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల తేదీ ప్రకటించిన వెంటనే అభ్యర్థుల ఎంపికను ప్రారంభిస్తామని అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ 3న గాంధీభవన్‌లో 24 నియోజకవర్గాల నేతలు..డివిజన్‌ కమిటీ నాయకులతో సమావేశం జరుపతామని చెప్పారు. 5,6 తేదీల్లో నియోజకవర్గ, డివిజన్‌ స్థాయి సమావేశాలు ఉంటాయని, 4న ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఉత్తమ్‌ వెల్లడించారు.గ్రేటర్‌లో సెటిలర్లకు టిక్కెట్లు ఇస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. అక్కడ ఎక్కువ ఉన్నవారికే టిక్కెట్లు ఇస్తామని అన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఈనెల 7 నుంచి ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు. 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయో ముస్లింలు గమనించాలి సూచించారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పన్ను రాయితీలు ప్రకటించిందని ఉత్తమ్‌ విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హావిూలనై నిలదీయాలన్నారు.