12గంటలకు వాయిదా పడిన లోక్‌సభ
న్యూఢిల్లీ: పూంచ్ సెక్టార్‌లో భారత జవాన్లపై కాల్పుల ఘటన పార్లమెంటును కుదిపేసింది. జవాన్లపై దాడికి సంబంధించి రక్షణశాఖ విరుద్ధప్రకటనలపై ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్చజరుగుతుండగా సభలో గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు.