13ఏళ్ల కుర్రాడు.. సోలార్ కారు త‌యారుచేశాడు

రేవారి: చిన్న వయస్సులోనే అద్భుత ఆవిష్కరణలు చేస్తూ భారత విద్యార్థులు అబ్బురపరుస్తున్నారు. హరియాణాలోని రేవారికి చెందిన పదమూడేళ్ల అన్వీత్‌ అటువంటి ఆవిష్కరణే చేశాడు. సోలార్‌తో నడిచే మూడు చక్రాల వాహనం రూపొందించి అందరిచేత శభాష్‌ అనిపించుకున్నాడు. త్వరలోనే సోలార్‌ కారు కూడా తయారు చేస్తానని అన్వీత్‌ నమ్మకంగా చెబుతున్నాడు. కాలుష్య రహిత, అందరికీ అందుబాటులో ఉండే ధరలో వాహనం రూపొందించడం విశేషం. గంటకు 20 కి.మీ వేగంతో నడిచే వాహనంలో పలురకాల ఫీచర్లు ఉన్నాయి. ఛార్జింగ్‌ పోర్టులు, యాంటీ స్లీపింగ్‌ అలారం సిస్టమ్‌ వంటి హంగులను జత చేశాడు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టార్‌ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.భవిష్యత్తులో సోలార్‌ కారును తయారు చేయడమే తన లక్ష్యమని అన్వీత్‌ అంటున్నాడు. ఆ కారు ధర ప్రస్తుతం ఉన్న నానో కంటే తక్కువగా ఉంటుందని భరోసా వ్యక్తం చేయడం విశేషం.