13 మందితో కోర్ కమిటీ : అన్నా హజారే
ఢిల్లీ : వ్యవస్థలో మార్పు కోసం విప్లవానికి సమయమాసన్నమైందని అన్నాహజారే అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ దేశ పరిరక్షణ కోసం విప్లవం తప్పదని దీని కోసం 13 మందితో కోర్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2014లోపే కేంద్రం లోక్‌పాల్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అందరూ ఏకతాటిపై నడవాలని కోరారు. ఆదివారం ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. జనవరి 30 నుంచి దేశవ్యాప్త పర్యటన చేస్తున్నట్లు చెప్పారు.