130 కోట్ల నగదు, నగలు స్వాధీనం

 maxresdefault-2బ్యాంకు లాకర్లు, బంగారంపై సోషల్‌ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘బ్యాంకు లాకర్లన్నిటికీ సీల్‌ వేసి అందులోని డబ్బును ప్రభుత్వం జప్తు చేస్తుందన్న ప్రచా రం బాగా నడుస్తోంది. బంగారం నిల్వలపై పరిమితులు విధిస్తున్నామన్నదీ వదంతే. ఇవన్నీ పూర్తిగా నిరాధారాలు’ అని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్‌ ఆధియా కొట్టిపారేశారు. మంగళవారం ముంబైలో ప్రారంభమైన బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) దేశాల రెవెన్యూ కార్యదర్శుల రెండ్రోజుల సదస్సు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రతి బ్యాంకు ఖాతాలో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాం. ఖాతాలను దుర్వినియో గం చేసేవారినే ఆ డబ్బుకు ఆధారాలు, రుజువులు అడుగుతాం. దర్యాప్తు జరుపుతాం. నిష్కళంక కేసుల్లో మాత్రం ఎలాంటి స్కూట్రినీ ఉండదు. మనీలాండరిగ్‌కు పాల్పడేవారిని, వారికి సహకరించే బ్యాంకులు, ఐటీ శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నల్లధనం నిల్వలున్నవారు ఆ డబ్బును ఉపయోగించకుండా మరిన్ని చర్యలు చేపడతాం. నోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశంలో రూ.130 కోట్ల నగ దు, నగలు పట్టుబట్టాయని ఐటీ శాఖ వెల్లడించింది. అలాగే రూ.2వేల కోట్ల విలువచేసే సంపదకు లెక్కచెప్పలేదని కొందరు పన్నుచెల్లింపుదారులు అంగీకరించారని తెలిపింది. ‘ఆయా వ్యవహారాల్లో ఈడీ, సీబీఐ 30కిపైగా కేసులు నమోదుచేశాయి. 14 లక్షల కోట్ల విలువచేసే రూ.500, 1000 నోట్లు చలామణిలో ఉండగా.. నవంబరు 27 వరకు 8.5 లక్షలకోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయని పేర్కొంది. అని అన్నారు.