శ్రీలంక విజయ లక్ష్యం 131

మిర్పూర్: ఆదివారం ఇక్కడ జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రత్యర్ధి జట్టు శ్రీలంక జట్టుకు 131 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.క్లుప్తంగా స్కోరు:భారత్: నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు (విరాట్ కొహ్లీ 77; రంగానా హెరత్ 1/23).