132 వ మే-డే దినోత్సవాన్ని విజయవంతం చేయండి –
సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్. హుస్నాబాద్ ఏప్రిల్ 30(జనం సాక్షి): నేడు ఉదయం 8గంటలకు హుస్నాబాద్ అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ వద్ద ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా, 132 వ మేడే జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని, కావున నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, శ్రామికులు, అభిమానులు అందరూ తప్పకుండా హాజరై మేడే ఉత్సవం ను విజయవంతం చేయాలని గడిపే మల్లేష్ కోరారు . కార్మికుల కు విప్లవ శుభాకాంక్షలు తెలిపారు .