జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రాక
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతిళ్ళికేరి
మంచిర్యాల ప్రతినిధి, నవంబర్ 11, (జనంసాక్షి) :
రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి ¬ళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిశీలకులు ఆర్.జె.హలాని ఐ.ఎ.ఎస్., చెన్నూర్ నియోజకవర్గం, జి.హెచ్.ఖాన్ ఐ.ఎ.ఎస్. బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలలో పర్యటించేందుకు రానున్నారని, పోలీస్ పరిశీలకులు సంజయ్‌కుమార్ ఐ.పి.ఎస్., 001 నుండి 010 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ నెల 19వ తేదీ నుండి పర్యటిస్తారని, ఎన్నికల ఖర్చుల పరిశీలకులు ఉదయ్ భాస్కర్రాఖే ఐ.ఆర్.ఎస్. 002-చెన్నూర్, 003-బెల్లంపల్లి, 004-మంచిర్యాల నియోజకవర్గాలలో ఈ నెల 12వ తేదీ నుండి పర్యటిస్తారని ఎన్నికల అధికారి తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, ఎన్నికల నియమావళి అధికారులు తమ తమ పరిధిలోని సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.