గూడెం గుట్టలో భక్తుల కార్తీక సందడి

దండేపల్లి, నవంబర్‌ 25, (జనంసాక్షి) :

కార్తీక మాస బహుళ విదియ పురస్కరించుకోని దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో వేలాది మంది భక్తులతో కార్తీక సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సత్యదేవుని దర్శనం కోసం భక్తులతో ఆలయ పరిసర ప్రాంతమంత బక్తులతో కిటకిటలాడింది.ప్రవిత కార్తీక మాసం కావడంతో ఉదయం నుండే గూడెం గోదావరి నదికి తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజల నడుమ గోదావరి నదిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకొని సత్యదేవున్ని దర్శించుకోని భక్తులు స్వామి వారికి అభిషేకాలు, నిత్య పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వందలాది మంది భక్తులు అయ్యప్ప మాలాధారణలు స్వీకరించారు. దీంతో గూడెం పరిసర ప్రాంతమంతా భక్తులతో కార్తీక శోభ సంతరించుకొంది.