ప్రజాప్రతిరేక విధానాలు అవలంభించిన టిఆర్‌ఎస్ పార్టీని ఓడించాలి
చెన్నూర్ మహాకూటమి అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత
రామకృష్ణాపూర్, నవంబర్ 25, (జనంసాక్షి) :
టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేకమైన ప్రజా వ్యతిరేకమైన విదానాలను అవలంభించిన టిఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని చెన్నూర్ మహాకూటమి అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. ఆదివారం రామకృష్ణాపూర్‌లో ఏర్పాటు చేసిన ఎఐయుటసి, సిపిఐ పార్టీ సర్వసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని కేసీఆర్ అధికారంలోకి వస్తే సింగరేణిలో కొత్త బావులు తీసుకువస్తామని, ఇన్‌కాం టాక్స్ రద్దు చేస్తామని, కారుణ్య నియమాకాలు అమలు చేస్తామని, 10 లక్షల వడ్డిలేని ఋణం ఇస్తానని, మారు పేర్లు సవరిస్తామని చెప్పిన కేసీఆర్ ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. అనంతరం ఎఐటియుసి ఆదనపు కార్యదర్శి మిర్యాల రంగయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్‌లు మాట్లాడుతు బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి సాధించాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకులు మారాలన్న నిరుద్యోగలకు ఉద్యోగ అవకాశాలు రావాలన్న మహాకూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చెన్నూర్ నియోజకవర్గ కార్యదర్శి పి.భానుదాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, పట్టణ మండల కార్యదర్శులు మిట్టపల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, ఎఐటియుసి బ్రాంచి కార్యదర్శి ఎం.డి.అక్బర్ అలీ, ఎఐటియుసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాలయ లింగయ్య, ఫిట్ కార్యదర్శి గాజుల రాయమల్లు, ఆంజనేయులు, సంజీవరెడ్డి, బ్రాంచి సహాయ కార్యదర్శి సిద్దంబాపు, మహిళ నాయకులు పెండ్యాల కమలమ్మ, గాజుల మణేమ్మ, పబ్బరాజమణి తదితరులు పాల్గొన్నారు.