14 నుంచి కొత్త ఆర్‌ఎస్సైలకు శిక్షణ

ఏపీఎస్పీ బెటాలియన్స్‌ డీజీ వెల్లడి
హైదరాబాద్‌ : ఏపీఎస్పీ బెటాలియన్స్‌లో రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి శిక్షణ ప్రారంభం కానున్నట్లు బెటాలియాన్స్‌ అదనపు డీజీ పేర్కొన్నారు. హిమాయత్‌సాగర్‌లోని పోలీస్‌ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13న తేదీన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, ఎమ్మెల్యే అండ్‌ ఎంపీ కాలనీ రోడ్‌ నెంబరు 10-సీ, ఏపీఎస్పీ బెటాలియన్స్‌ శౌర్యభవన్‌లో ఐజీ వద్ద రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.అభ్యర్థులు తీసుకురావాల్సినవి…
ట్రెజరర్‌, జూ.ఆఫీసర్స్‌ మెన్‌, ఏపీ పోలీసు అకాడమీ, హైదరాబాద్‌ పేరుతో రూ. 12 వేలకు డీడీ.
ఇప్పటి వరకూ సమర్పించిన పత్రాలకు సంబంధించిన అసలు (ఒరిజినల్‌) సర్టిఫికెట్లు.
ప్రభ్వు సంస్థల్లో పని చేస్తున్నట్లయితే వారి రిలీప్‌/రాజీనామా పత్రాలను యూనిట్‌ అధికారుల నుంచి తీసుకురావాలి.
ఆరు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
ప్రతి అభ్యర్థి తమతో రెండు జతల టెర్రీకాట్‌ తెల్ల ప్యాంటు, చొక్కాలు, నలుపు రంగు తోలు బూట్లు, నల్ల సాక్సులు తెచ్చుకోవాలి.
పైన పేర్కొన్న డాక్కుమెంట్లను సమర్పించనట్లయితే వారికి ఎంపిక పత్రాలు అందజేయమని డీజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.