1400 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు

3

: ఎర్రబెల్లి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి):

రైతు ఆత్మహత్యలను కుదించవద్దని తెదేపా శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. రైతు సమస్యలపై చర్చ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… తెలంగాణలో ఇప్పటివరకు 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కరవు, వరద నష్టాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదకలు పంపించట్లేదని, సరైన నివేదికలు పంపిస్తే కేంద్రం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 50శాతం మేర కరవు ప్రాంతమేనన్నారు. కరవు కింద ప్రకటిస్తే ప్రభుత్వం పరువు ఏమైనా పోతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ దేశంలోనే ధనిక రాష్ట్రం… కానీ ప్రజలు మాత్రం పేదోళ్లేనన్నారు. రైతులు ఎంత పంట వేశారు… దిగుబడి ఎంత వచ్చిందనేది ప్రభుత్వం నిర్థరించాలని సూచించారు. రైతులను హేళన చేుౖద్దు… ‘య్రర్యం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని కోరారు.