15శాతం రిజర్వేషన్ కల్పించాలి
కడప, జూలై 29 : రాష్ట్రంలోని మైనారిటీ ముస్లింలకు సచార్ కమిటీ సిఫారసు మేరకు 15శాతం రిజర్వేషన్ కల్పించాలని ముస్లిం రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ ఆలీ డిమాండు చేశారు. మైనారిటీలకు ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్‌వలె అమలు చేయాలన్న యోచనలో ఉందని చెప్పారు. కేవలం ముస్లిం వర్గాలకే 15 నుంచి 30 శాతం వరకు నిధులు కేటాయించి ప్రభుత్వం వారి సామాజిక ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు. అన్ని పరిపాలన విభాగాల్లోను ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.