15 నుంచి భవాని దుర్గ నవరాత్రులు

15 నుంచి భవాని దుర్గ నవరాత్రులు

వనపర్తి బ్యూరో అక్టోబర్13 (జనంసాక్షి)కొత్తకోట పట్టణ కేంద్రంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర దేవాలయంలో ఈనెల 15 నుండి 24 వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు ఆనంద్, శివశంకర్, అనిల్ కుమార్, మంజునాథ్ గారు తెలిపారు.కొత్తకోట పట్టణంలో వెలిసిన అమ్మ భవాని దుర్గామాత అమ్మవారు స్వయంభుగా వెలిసి భక్తుల కొంగు బంగారం అతి ప్రాచీన దేవాలయంగా గ్రామ దేవతగా గ్రామ తల్లిగా గుర్తింపు ఉన్న దేవాలయం భవాని మాతకు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు ఈసారి కూడా అలంకరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.ఈ నవరాత్రులు దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన రోజులు, ఆమె తన భక్తుల పట్ల తనను నమ్ముకునే వారి పట్ల కోరికలు తీరే పర్వదినాలు కావున అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మ వారి కరుణాకటక్షాలను పొందగలరు.
మొదటిరోజు-15వ తేదీ: ఆదివారం శ్రీ లలితా దేవి.
రెండో రోజు-16వ తేదీ: సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి.
మూడో రోజు-17వ తేదీ: మంగళవారం శ్రీ గాయత్రీ దేవి.
నాలుగో రోజు-18వ తేదీ బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి.
అయిదో రోజు-19 వ తేది:గురువారం శ్రీ మహాలక్ష్మి దేవి.
ఆరో రోజు-20వ తేదీ: శుక్రవారం శ్రీ సరస్వతి దేవి.
ఏడో రోజు-21వ తేదీ శనివారం శ్రీ అర్ధనారీశ్వరి దేవి.
ఎనిమిదో రోజు- 22వ తేదీ ఆదివారం శ్రీ దుర్గా దేవి.
తొమ్మిదో రోజు-23వ తేదీసోమవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి.
పదో రోజు-24వ తేదీ:మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
*ప్రతిరోజు సాయంత్రం కుంకుమార్చన నిర్వహిస్తారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని తరించాలని కోరుతున్నాము