పట్టుబడ్డ మరో అక్రమ ఇసుక ట్రాక్టర్

-రాంపురం సరిహద్దుల్లో ఇసుక ట్రాక్టర్ పట్టివేత

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి23(జనంసాక్షిఅక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను సోమవారం రాత్రి సమాచారం తెలుసుకున్న రాంపురం విఆర్వో అశోక్ చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడ్డ అక్రమ ఇసుక ట్రాక్టర్ ను గార్ల పొలీసులకు అప్పగించారు. రాంపురం, మద్దివంచ ప్రాంతాలలో ఇసుక అక్రమాలను ఆపకపోతే సహించేది లేదని అశోక్ హెచ్చరించారు. అక్రమంగా ఇసుకను ఎవరైనా తరలిస్తున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.