16న మహా బతుకమ్మ
ఆదిలాబాద్,అక్టోబర్10(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు ‘మహా బతుకమ్మ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. బతుకమ్మలు అందుబాటులో ఉంటాయని, కోలలు మాత్రం వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.