17న మహాసభల సన్నాహక సమావేశం
ఖమ్మం, నవంబర్ 15 : డిసెంబర్‌లో జరగబోయే తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర మహాసభలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఈ నెల 17న జరగనున్నదని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. 17న మధ్యాహ్నం రెండు గంటలకు పట్టణంలోని బైపాస్‌రోడ్డులో గల కృష్ణ ఫంక్షన్ హాలులో సమావేశం జరుగుతుందని అన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులకు జూనియర్ సహాయకుని స్థాయి వేతనం నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ సిఎం రాజనరసింహ, కేంద్రమంత్రి బలరాంనాయక్, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, జిల్లా మంత్రి వెంకటరెడ్డి, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని వారు తెలిపారు.