17న విడుదల కానున్న ‘రాజకోట రహస్యం’

హైదరాబాద్‌ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రచించిన పొన్నార్‌ శంకర్‌ నవల ఆధారంగా తమిళ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘రాజకోట రహస్యం’ తెలుగులో సెన్సేషనల్‌ మూవీస్‌ పతాకంపై గోగినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత గోగినేని ‘రాజకోట రహస్యం ‘ విశేషాలను వెల్లడించారు. త్యాగరాజన్‌ దర్శకత్వంలో మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా స్వరకల్పనలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రశాంత్‌ ద్విపాత్రాభినయం చేయగా స్నేహ, పూజా చోప్రా, దివ్యా పరమేశ్వరన్‌ కథానాయికలుగా నటించారు. ప్రభు, ప్రకాశ్‌రాజ్‌ , నాజర్‌, నెపోలియన్‌ కీలక పాత్రల్లో నటించారు.