18 గిరిజన గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఏలూరు: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటితో పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నదిలో నీటి ఉద్థృతి పెరగడంతో సమీప గ్రామాలు వరద భయంతో వణికిపోతున్నాయి. పోలంవరం మండలంలోని 18 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు  గురవుతున్నారు.