18 వందల ఏళ్లనాటి రోమన్ దేవత విగ్రహం లభ్యం
లండన్: సుమారు 1800 ఏళ్లనాటిదిగా భావిస్తున్న గొర్డీరోమన్ దేవతా విగ్రహం శిరస్సును పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బిషప్ అక్‌లాండ్ ప్రాంతంలోని బిన్‌చెస్టర్ రోమన్ కోట వద్ద ఇది లభించింది. అత్యంత అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఈ దేవతావిగ్రహం ఎంతో ప్రత్యేకంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సైనిక,యుద్ధ వ్యవహారాల్లో
రాయబారాలకు స్ఫూర్తిగా బావిస్తూ ఆరాధించిన యాంటె నోసటికన్ దేవుడికి. ఈ గోర్డీ రోమన్ విగ్రహానికి దగ్గరి పోలికలున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం తవ్వకాల్లో వెలుగుచూసిన దైవపీఠం. ఆలయం ప్రాంతంలో కుప్ప కూలిపోయి ఉన్న స్నానపుగది శిధిలాల్లో ఈ విగ్రహం కూరుకుపోయి ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఇది ఏ దేవుడి విగ్రహం అనేది స్పష్టంగా తెలియలేదన్నారు. రోమన్-బ్రిటిష్ సంప్రదాయం ఈ విగ్రహంలో కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.