18న తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 18న మరోసారి తెలంగాణ మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సమావేశంలో ఆంటోని కమిటీకి ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. ఢిల్లీకి వెళ్లే తేదీని కూడా మంత్రులు ఖరారు చేయనున్నారు.