19న ఐటిడిఎ పాలకమండలి భేటీ

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : ఈనెల 19న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం కానుంది. వివిధ సమస్యలపై ఇందులో చర్చిస్తారు. అలాగే తీసుకోనున్న చర్యలపైనా సవిూక్షిస్తారు. ఇందుకు ఐటిడిఎ పివో శ్రీనివాస్‌ అధికారులతో కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు  అధికారులతో సవిూక్షించారు. ఈ సమావేశానికి అధికారులందరు పూర్తిస్తాయి వివరాలతో హాజరుకావాలన్నారు. సమావేశంలో సమస్యలపై సభ్యులడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు సిద్దంగాఉండాలన్నారు. ఇదిలావుంటే స్వైన్‌ఫ్లూతో పాటు ఇతర వ్యాధులపై గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని ఐటిడిఎ నిరర్ణయించింది. చాలా జబ్బులు అవగాహన లేకపోవడం, అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తున్నాయని ఐటీడీఏ పీఓ   అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రజల్లో చైతన్యం అవసరమన్నారు. స్వైన్‌ఫ్లొపై నిర్లక్ష్యం చేయకుండా వాటి లక్షణాలు, సోకడానికిగల కారణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన గ్రామాల్లో వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేయకుండా చూడాలని ఏజెన్సీ వైద్యాధికారులను   ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో స్వైన్‌ఫ్లొ, ఇతరాత్ర వ్యాధులపై ప్రచారం నిర్వహించి వైద్యసేవలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఇప్పటికే ఏజెన్సీకి చెందిన కొంత మంది అనుమానితులను హైదాబాద్‌కు పంపించి వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించామన్నారు. సందేహాలు నివృత్తి అయ్యాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ ప్రతి ఒకరు అప్రమత్తంగా ఉండాలని అనుమానంగా ఉన్నా తక్షణమే వైద్యులను సంప్రదించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ఇదిలావుంటే ఈనెల 22 నుంచి మలివిడతల పల్స్‌పోలియోకార్యక్రమం జరగనుంది.  దీన్ని విజయవంతం చేసేలా విస్త్రృతప్రచారం చేపట్టాలని కలెక్టర్‌  జగన్మోహన్‌ పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, ప్రధాన కూడళల్లో పోలియోచుక్కలు పిల్లలకు వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని, వారికి కార్యక్రమ వివరాలను తెలిపాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, పంచాయతీకార్యదర్శులు, వీఆర్వోలు, మండల, గ్రామాల్లోని ప్రభుత్వ అధికారులు, స్వచ్చందసంస్థల ప్రతినిధులు విజయవంతంచేసేలా ప్రచారం నిర్వహించాలన్నారు.