19 కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జులై22(జనంసాక్షి):
నూతన పారిశ్రామిక విధానం అనుసరించి మరో 19 కంపెనీలకు సిఎం కెసిఆర్ అనుమతి పత్రాలు జారీ చేసినారు. తెలంగాణకు రూ. 1,087 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 6 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. భగవతి ప్రొడక్ట్ లిమిటెడ్, రంగారెడ్డి జిల్లా శ్రీనాథ్ రోటోప్యాక్ ప్రై.లిమిటెడ్, మహబూబ్‌నగర్ జిల్లా, తొషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ మెదక్ జిల్లా, 3ఎఫ్ ఫుజీ ఫుడ్స్ ప్రై.లిమిటెడ్ మహబూబ్‌నగర్ జిల్లా , మరికల్ సోలార్ పార్క్ ప్రై.లిమిటెడ్ మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ సోలార్ పార్క్ ప్రై.లిమిటెడ్ మహబూబ్‌నగర్ జిల్లా, జీనోటెక్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ యూనిట్-2, రంగారెడ్డి జిల్లా, ఎస్‌ఆర్ బ్రహ్మాస్ అగ్రో ప్రొడక్ట్ ప్రై.లిమిటెడ్, వరంగల్ జిల్లా ఫర్చూన్ ఫోమ్ ప్రై.లిమిటెడ్, రంగారెడ్డి జిల్లా ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, రంగారెడ్డి జిల్లా గోల్డెన్ లీవ్స్, కరీంనగర్ జిల్లా, జోదాస్ ఎక్స్‌పోయిమ్ ప్రై.లిమిటెడ్, మెదక్ జిల్లా టాటా సికోర్‌స్కె ఎయిర్‌స్పేస్ లిమిటెడ్, రంగారెడ్డి జిల్లా పిట్టీ కాస్టింగ్స్ ప్రై.లిమిటెడ్, మహబూబ్‌నగర్ జిల్లా పిట్టీ లామినేషన్స్ లిమిటెడ్, ప్లాంట్-2, మహబూబ్‌నగర్, ప్యారాగాన్ పాలిమర్ ప్రొడక్ట్ ప్రై.లిమిటెడ్ యూనిట్-1, మెడక్ జిల్లా ప్యారాగాన్ పాలిమర్ ప్రొడక్ట్ ప్రై.లిమిటెడ్ యూనిట్-3, మెడక్ జిల్లా ఎంబెడెడ్ ఐటీ సొల్యూషన్స్ ప్రై.లిమిటెడ్, రంగారెడ్డి జిల్లా కంపెనీలకు సిఎం కెసిఆర్ అనుమతి పత్రాలు జారీ చేసినారు.్