19 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇంజినీరింగ్‌ కోర్సులో సీట్ల భర్తీ కోసం షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు ఇవాళ ఏపీ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 19 నుంచి 30 వరకు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు తెలిపారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. సెప్టెంబర్‌ 4 న ఆప్షన్ల మార్పు కోసం అవకాశం ఇస్తారు. సెప్టెంబర్‌ 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది. 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. సీట్ల భర్తీ కోసం 53 హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశామని చైర్మన్‌ తెలిపారు. కాగా, హైకోర్టు ఉత్తర్వుల మేరకు భర్తీ ప్రక్రియ ఉంటుందని, మెరిట్‌ ప్రాతిపదికనే సీట్ల భర్తీ ఉంటుందని ఆయన తెలిపారు.