కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
సెప్టెంబర్1 ( జనంసాక్షి): మహబూబ్‌నగర్ జిల్లాఅడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బస్సు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రొద్దుటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, వారిని ఉన్నిసా (70), ఎల్లమ్మ (45), హసన్ (35)గా గుర్తించామన్నారు.
క్షతగాత్రులను మహబూబ్ నగర్ దవాఖానకు తరలించామని వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.