2జీకి స్పందన కరువు

 

న్యూఢిల్లీ: నవంబర్‌ 14,(జనంసాక్షి):

దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన 2జీకి స్పందన కరువైంది.   2జీ స్పెక్ట్రం వేలం బుధవారంరోజన ముగిసింది. అయితే ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా తక్కువ బిడ్లు మాత్రమే దాఖలు కావటం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది. 2010లో జరిగిన 3జీ వేలంలో ప్రభుత్వానికి రూ. 67,719 కోట్ల ఆదాయం రాగా ప్రస్తుతం మాత్రం కేవలం 10వేల కోట్లు మాత్రమే రావటం గమనార్హం.  గత ఏడాది నిర్వహించిన 2జీ స్పెక్ట్రం వేలంలో అవినీతికి పాల్పడిన రాజాలు కనిమోలిలు జైలుపాలైన విషయం విదితమే 2జీ స్పెక్ట్రం అనగానే గుర్తుకు వచ్చేది. రాజా, కనిమోలీలే ఇంత అప్రదిష్టను మూట గట్టుకున్న యూపీఏ ప్రభుత్వానికి ఈ సారి షాక్‌ తగిలింది ప్రభుత్వ అశీంచిందానికి భిన్నంగా తక్కువ బిడ్లు మాత్రమే రావటం గమనార్హం.