2న కొలువుదీరనున్న కొత్త పంచాయితీలు
హైదరాబాద్,జనవరి30(జనంసాక్షి): తెలంగాణ గ్రామ పంచాయతీల కొత్త పాలకమండళ్ల అపాయింట్ డేను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 2వ తేదీని అపాయింట్ డేగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ రోజున పంచాయతీ పాలకవర్గాల తొలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అపాయింట్ డే నోటిఫికేషన్‌ను పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. రాష్ట్రంలో 12 వేల పైచిలుకు గ్రామ పంచాయతీలకు మూడు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. సుమారు లక్షా 10 వేల పైచిలుకు వార్డులకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని గ్రామపంచాయతీల ఓటర్ల సంఖ్య 1,49,52,058. ఈ నెల 21,25, 30 తేదీల్లో పంచాయితీ ఎన్నికలు ముగిసాయి. పంచాయితీలకు సర్పంచ్‌లు,ఉపసర్పంచ్‌లు ఎన్నికయ్యారు.