20నుంచి కేంద్రీయ విద్యాలయం తరగతులు

నిజామాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. కేంద్రీయ విద్యాలయం కోసం ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం రావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపి కవిత కేందరంతో పట్టుబట్టి దీనిని సాధించారు. దీంతో ఈ ప్‌ఆరంత ప్రజల పిల్లలకు కేంద్రీయ విద్యాలయ కల తీరనుంది. బట్టీ విద్యకు స్వస్తి చెబుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశం కోసం దరఖాస్తుల పక్రియ పూర్తయింది. ఈ నెల 20 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. గతంలోనే ఇందూరు నగరానికి మంజూరైన కేవీ.. బోధన్‌కు తరలిపోయింది. ఇప్పుడు కేంద్రం మరోసారి నిజామాబాద్‌ కు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. 2018 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించనున్నారు. కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తులకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. సీబీఎస్‌సీ సిలబస్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు సామాన్యులకూ ప్రవేశాల్లో అవకాశం ఉంది. విద్యాహక్కు చట్టం కింద కొన్ని సీట్లను కేటాయించారు. ప్రతి తరగతిలో 40 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.