20న ప్రత్యేక లోక్ అదాలత్
ఖమ్మం, అక్టోబర్ 19 : జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థి ఆదేశాల మేరకు ఈనెల 20న ప్రత్యేక లోక్ అదాలత్ ఖమ్మంలో జరగనున్నదని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి సుశీల్ కుమార్ తెలిపారు. రోడ్డు రవాణ సంస్థ, న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రైవేటు భీమా కంపెనీలపై దాఖలైన మోటారు ప్రమాద భీమా కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించబడతాయని అన్నారు. రెండవ అదనపు జడ్జీ కిషోర్ కుమార్ లోక్ అదాలత్ బెంచికి అధ్యక్షత వహించనున్నారు. కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొని కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.