20లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తులు
ఖమ్మం, నవంబర్ 6 : 2012-13 విద్యాసంవత్సరంలో పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 20 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి, మైనార్టీ, వికలాంగ విద్యార్థులు ఈ-పాస్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.