20 కోట్లతో ఆకేరు వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన – ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్.

డోర్నకల్ నియోజవర్గం అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం.

డోర్నకల్ /సీరోల్, సెప్టెంబర్-6, జనం సాక్షి న్యూస్ : సీఎం హయాంలోనే అభివృద్ధి సాధ్యంమని డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. శుక్రవారం సీరోల్ మండలం మోదుగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఆకేరు వాగు పై 20 కోట్ల వేగంతో హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్. ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యా మాట్లాడుతూ వర్షాకాలం రావడంతో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాలంటే ఉమ్మడి అందనాలపాడు, మన్నెగూడెం, మోదుగడ్డ తండా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ గమనించి సీఎం కేసీఆర్ కృషితోనే మన్నెగూడెం ఆర్ అండ్ బి రోడ్డు నుండి దుబ్బ తండా వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. దేశంలో ఇక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ కృషి తోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆయన అన్నారు. మోదుగడ్డ తండా గ్రామానికి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే రెడ్యా కు శాలువాలతో ఘన సన్మానం చేసిన గ్రామ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు. రాబోయే ఎన్నికల్లో శాసనసభ్యుడు రెడ్యానాయక్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బిఆర్ఎస్ నాయకులు వీరన్న అన్నారు. మన్నెగూడెం గ్రామంలోని పిఎసిఎస్ సొసైటీ 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యుడు రెడ్యా నాయక్. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎంపీపీ డిఎస్ బాలు నాయక్, మన్నెగూడెం సొసైటీ చైర్మన్ కొండపల్లి సీతారాంరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు అంగోత్ హరీష్,పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఎల్లమద్ది మన్మధరావు, సర్పంచులు బానోతు రమేష్, అంగోత్ మోహన్, కొండపల్లి రాధిక, ఎంపీటీసీ నీలా రమేష్, విజయ పాల్ రెడ్డి, గొల్లచెర్ల ఎంపిటిసి భూక్య శ్రీనివాస్ నాయక్,బిఆర్ఎస్ నాయకులు రామనాథం,నంజలా మధు, వీరన్న, వెంకట్య,సొసైటీ డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ లు, డిఇ మహేష్, డోర్నకల్ ఎంపీడీవో బి వి చలపతిరావు, ఎంపీఓ మున్వర్ బేగ్,సీరోల్ తాసిల్దార్ దామోదర్, మన్నెగూడెం సొసైటీ సీఈవో సతీష్, పంచాయతీ కార్యదర్శిలు గ్రామ పెద్దలు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.