20 నుంచి టిడిపి సమావేశాలు

కరీంనగర్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) : కరీంనగర్‌లో ఈ నెల 20 నుంచి టిడిపి నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి తెలిపారు. అనంతరం మార్చి 3న జిల్లా విస్తృత సమావేశం జరుగుతుందని వివరించారు. కరీంనగర్‌ అనంతరం మిగతా అన్ని జిల్లాల్లో తెదేపా విస్తృత సమావేశాలు జరుగుతాయన్నారు. ఇటీవల వరంగల్‌లో బాబు పర్యటనతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందన్నారు. ఒక్కొక్క గ్రామం నుంచి 20 మంది కార్యకర్తలతో జిల్లా స్థాయి సమావేశానికి దాదాపు 20వేలపైగా హాజరయ్యేటట్లు చూస్తున్నామని పేర్కొన్నారు.  పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపి వారికి అండగా ఉంటామనే భరోసా ఇచ్చేందుకు జిల్లాలో తెదేపా విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రావిూణాభివృద్ధి తమ పార్టీ హయంలోనే జరిగిందన్నారు. తెలంగాణలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు.  తెలంగాణలో పింఛన్లను ప్రవేశపెట్టిన ఘనత తెదేపాదేనన్నారు. ,  ప్రజాప్రతినిధులు, మాజీలు, ఇటీవల ఎన్నికలో ఓడిన, గెలిచిన పార్టీ నాయకులను సమావేశాలకు ఆహ్వానిస్తామన్నారు. మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.