2016-17 రైల్వే బడ్జెట్ – రాష్ట్రానికి దక్కేదేంటి..?

 lv97224i

గత ఏడాది బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించినా.. పనులు మాత్రం పట్టాలెక్కలేదు. ఏ వర్క్ కంప్లీట్ కాలేదు. పెద్దపల్లి నుంచి  కరీంనగర్ – నిజామాబాద్ ప్రాజెక్టు కోసం 141 కోట్లు కేటాయించారు – అలాగే మేళ్లచెర్వు- విష్ణుపురం ప్రాజెక్టుకు వంద  కోట్లు కేటాయించారు. మరో ప్రాజెక్టు మనోహరాబాద్ – కొత్తపల్లి రూట్ కు 20 కోట్లు కేటాయించారు. బడ్జెట్ కేటాయింపులో చూపిన ఇంట్రెస్ట్ వర్క్స్ కంప్లీట్ చేయడంపై పెట్టలేదని వాపోతున్నారు పబ్లిక్.

ఈ బడ్జెట్ లో మౌలిక వసతుల కల్పన కోసం 2 వేల 768 కోట్లు,  కొత్త లైన్ల కోసం 511 కోట్లు, డబ్లింగ్ పనుల కోసం 233 కోట్లు,  బ్రిడ్జీల నిర్మాణం కోసం 26 కోట్లు, రోడ్డు ఓవర్ బ్రిడ్జీల కోసం వంద కోట్లు, ట్రాఫిక్ వసతుల కల్పనకు మరో 40 కోట్లను కేటాయించారు.

ఇక బడ్జెట్ లో ప్రకటించిన రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి కూడా అంతే…ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంది…కాజీపేట- బల్హర్షా మార్గంలో 202 కిలోమీటర్ల పరిధిలో ట్రిపుల్ లైన్ల నిర్మాణం కోసం 2020 కోట్లు కేటాయించగా…ఇప్పటి కేవలం 46 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ మార్గంలో 101 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనుల కోసం 1200 కోట్లు కేటాయించగా…ఇప్పటి వరకు 27 కోట్లు మాత్రమే విడుదల చేశారు.  2015 రైల్వే బడ్జెట్ లో భారీ ప్రాజెక్టులకు సైతం అరకొర నిధులు కేటాయించడంతో పనులు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు.  కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటి వరకు అసలు పనులే ప్రారంభం కాలేదు.  2014 బడ్జెట్ లో కంటే 2015 రైల్వే బడ్జెట్ లో నిధులు 24 శాతం పెంచినా…. పనులు మాత్రం ప్రారంభించలేదంటున్నారు పబ్లిక్.