2019లో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా

Gandhinagar: Congress Vice President Rahul Gandhi addresses a public meeting in Gandhinagar, Gujarat on Monday. PTI Photo (PTI10_23_2017_000149B)

బెర్లిన్‌లో ఇండియన్‌ ఓవర్సీ కాంగ్రెస్‌లో రాహుల్‌ వెల్లడి
న్యూఢిల్లీ,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ 2019లో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇచ్చితీరుతామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బెర్లిన్‌లో ఇండియన్‌ ఓవర్సీ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక ¬దా అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని, దీన్ని తామంత తేలిగ్గా తీసుకోమని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే ప్రత్యేక ¬దా కల్పిస్తామని, ఇది ఏపీ ప్రజలకు తాను ఇస్తున్న హావిూ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి లేని రాష్ట్రాల్లో పాలనను ప్రధాని మోదీ బలహీనపరుస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు దన్నుగా నిలుస్తూ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో  పాలనను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై కాంగ్రెస్‌ అభిప్రాయం ఏంటీ అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఆంధ్రాకు ప్రత్యేక¬దా కల్పిస్తామని భారత ప్రభుత్వం హావిూ ఇచ్చింది. ఈ హావిూని సులువుగా తీసుకోలేం. 2019లో మేం అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రత్యేక¬దా ఇస్తామని ఆంధప్రదేశ్‌ ప్రజలకు హావిూ ఇస్తున్నా’ అని రాహుల్‌గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు చేశారు. ప్రత్యేక ¬దాపై చర్చ సమయంలో మోదీని కౌగలించుకోవడం గురించి కూడా రాహుల్‌ ప్రస్తావించారు. ‘నిజం కంటే అబద్ధం వేగంగా వెళ్లలేదు. ఉదాహరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచూ నాపై, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే ఒకటి చెప్పండి.. అవన్నీ పాపులర్‌ అయ్యాయా? లేదా నేను హగ్‌ ఇవ్వడం పాపులర్‌ అయ్యిందా? అభిమానం అనేది చాలా శక్తిమంతమైనది. దాన్ని నువ్వు నిజంగా ఫీల్‌ అయితే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. వారంతా తమ జీవితాలతో విసిగెత్తిపోయారు. అందుకే అలా ప్రవర్తిస్తున్నారు’ అని రాహుల్‌ చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక ¬దా విషయంలో కేంద్రం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్మానానికి కాంగ్రెస్‌ కూడా మద్దతిచ్చింది. ఈ అవిశ్వాసంపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ
సందర్భంగా ప్రసంగించిన రాహుల్‌గాంధీ.. ప్రసంగం పూర్తయిన తర్వాత హఠాత్తుగా మోదీ వద్దకు వెళ్లి ఆయనను కౌగలించుకున్నారు. జర్మనీలో రెండురోజుల పర్యటన జరుపుతున్న రాహుల్‌ అక్కడ్నించి యూకే వెళ్తున్నారు. అక్కడ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ విద్యార్థులతోనూ, ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌తోనూ ఆయన సమావేశమవుతాయి.