2022`23 ఆర్థిక ఆరోగ్య డేటా..
8వ స్థానంలో తెలంగాణ..
` 17లో ఏపీ
న్యూఢల్లీి(జనంసాక్షి):2022`23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఆర్థిక ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. రెవెన్యూ సవిూకరణ, ఖర్చులు, అప్పులు, చెల్లించే సామర్థ్యంపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. ఈ మేరకు 2022`23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య డేటాను 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ విడుదల చేశారు. ఈ జాబితాలో ఏపీ 17వ స్థానంలో ఉండగా.. తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య స్థితి బాగుందని తెలిపింది.