2024 వరకు హైదరాబాదే రాజధాని

టిడిపి అనవసర రాద్దాంతం చేస్తోంది
మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నాం
మరోమారు మంత్రి బొత్స వ్యాఖ్యలు
అమరావతి,మార్చి7(జనం సాక్షి): శాసనసభలో టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సమావేశం అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి శాసనరాజధానిగా గుర్తిస్తున్నామని బొత్స మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి రాజధాని అమరావతి చట్ట ప్రకారం జరుగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం మూడు రాజధానులు ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. తమ ఎన్నికల ప్రణాళికలో భాగంగా పార్లమెంటరీకి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హావిూని నెరవేరుస్తున్నామని ఆయన వెల్లడిరచారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి విధానాలు, కార్యక్రమాలంటూ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారని, ప్రజల గురించి ఆలోచించరని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ పట్టించుకోదని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు అంగీకరించరని మంత్రి అన్నారు. చట్టాలు చేసే అధికారం శాసనసభకు ఉందని.. ఆ అధికారం లేదని చెప్పడం సరికాదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. 2024 వరకు మన రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్‌ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమేనని బొత్స వ్యాఖ్యానించారు. అయితే బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే అమరావతే రాజధాని అని అక్కడ్నుంచే అన్ని కార్యకలపాలు సాగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కీలక తీర్పును వెల్లడిరచింది. మరోవైపు మూడు రాజధానులు కట్టాలా..? వద్దా..? అని జగన్‌ సర్కార్‌ ఆలోచనలో పడిరది. ఈ క్రమంలో బొత్స చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. అసలు రాజధానులు కడుతున్నారా..? అని విూడియా మిత్రులు.. మంత్రిని ప్రశ్నించగా.. ’ ఇప్పుడే కదా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31లోపు అన్ని విషయాలు తెలుస్తాయి. రాజధానులు కట్టకూడదని హైకోర్టు ఎక్కడ చెప్పింది. చట్టాలు చేయడానికి శాసనసభ, పార్లమెంట్‌లు ఉన్నాయి. ఇక్కడ చట్టాలు చేస్తే రాజ్యాంగాని స్పూర్తికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అనేది నేను ఇదివరకే చెప్పాను. అలా కాదు.. శాసనసభ, పార్లమెంట్‌లు చట్టాలు చేయకూడదని కోర్టు చెప్పడమేంటి..? ఇవి చేయకూడదని న్యాయస్థానాలు చెబితే అసలు వ్యవస్థ ఎక్కడుంటుంది..?. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే కదా తప్పుబట్టొచ్చు.. ఎవరి పనులు వాళ్లు చేయాలి.. చేసుకోవాలి. కోర్టులపై మాకు నమ్మకం ఉంది.. చట్టాలు చేయడానికే శాసనసభ ఉన్నది.. ఆ అధికారం చేసే అధికారం శాసనసభకు అధికారం ఉంది’ అని మంత్రి చెప్పుకొచ్చారు.టీడీపీపై విమర్శలు..’టీడీపీకి విధి విధానాలు అనేవి లేవు. క్షణికావేశంలో టీడీపీ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ ఏదో ఉద్ధరించాలని, సానుభూతి పొందాలని, రాజకీయ సానుభూతితో అసెంబ్లీకి వచ్చారు. స్వార్థం కోసం తప్ప వాళ్లు ప్రజా ప్రయోజనాలు, సమిష్టి నిర్ణయాలు, సమిష్టి అభిప్రాయాలు ఆ పార్టీకి లేవు. క్షణికావేశంలో తీసుకునే ఏ ఆలోచనలనూ ప్రజలు ఆమోదించరు. విశాలమైన ఆలోచనలు, దూర దృష్టితో తీసుకునే నిర్ణయాలను మాత్రమే ప్రజలు ఆమోదిస్తారు’ అని
టీడీపీపై బొత్స తీవ్ర విమర్శలు గుప్పించారు.