21.48 మిలియన్ డాలర్లు పలికిన గోల్కోండ వజ్రం
4 : అరుదైన గోల్కొండ వజ్రం అత్యధిక ధరను పలికింది. హైదరాబాద్‌లోని గోల్కొండ వద్ద తవ్వి తీసిన 76.02 క్యారట్ల వర్ణరహిత వజ్రం 21.48 అమెరికా డాలర్లు 20.355 సివ్స్ ఫ్రాన్స్) పలికింది. జెనివాలో జరిగిన వేలంపాటలో వజ్రం ఆ ధరను పలికింది. ఈ వేలం మంగళవారంనాడు జరిగింది.19ఏళ్ల క్రితం బిడ్డరు కొనుగోలు చేసిన ధరకు రెండింతల ధర ఈ వేలంలో పలికింది. ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రానికి, వర్ణరహిత వజ్రం క్యారట్‌కు పలికే ధరల విషయంలో ఇదే రికార్డు, క్రిస్టీ అంతర్జాతీయ ఆభరణాల శాఖ డైరెక్టర్ ఫ్రాంకియోస్ కూరీల్ ఈ విషయం చెప్పారు. ఈ గోల్కొండ వజ్రం ఆస్టియాకు చెందిన అర్చుడుకే జోసెఫ్ ఆగస్టుకు చెందింది. అతను 1962లో మరణించాడు. ఈ వజ్రాన్ని 1933లో ఆస్ట్రియా రాకుమారుడు హంగేరీ జనరల్ క్రెడిట్ బ్యాంక్ వాల్ట్‌లో డిపాజిట్ చేశారు.