22న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 22న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, క్షేత్రస్థాయి సమీక్ష నేపథ్యంలో తెలంగాణ, సమైక్యాంధ్ర ప్రస్తావన ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర అంశలపై చర్చించడానికి పీసీసీ కార్యవర్గం ఉందని చెప్పారు.