22న సిపిఎం బహిరంగ సభ
హైదరాబాద్ : సిపిఎం 22వ జాతీయ మహాసభలు దేశ, తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈనెల 22న సరూర్‌నగర్ స్టేడియంలో సిపిఎం బహిరంగసభ ఉంటుందని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నామని ఆయన చెప్పారు. మలక్‌పేట నుంచి 25వేల మంది వాలంటీర్ల కవాతు ఉంటుందని చెప్పారు. తమ పార్టీ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, పాలకవర్గాల ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో చైతన్యం తెస్తూ పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.