నిర్విరామంగా వానలు

చొప్పదండి, జూలై 27 (జనం సాక్షి): మండలంలో       గత ఐదు రోజుల నుండి వర్షాలు నిర్విరామంగా కురుస్తుండడంతో అన్ని గ్రామాల్లో వాగులు ,కుంటలు చెరువులు నీటితో నిండి పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరద నీరు చేరి నీటితో కళకళలాడుతున్నయి. మత్స్యకారులు అధిక సంఖ్యలో చేపలు పడుతున్నారు. వర్షాలకు మండలంలోని మంగళపల్లిలోని మల్లికార్జున కుంట పై ఉన్న మూడు సంవత్సరాల నాటి మహావృక్షం నేలరాలిపోయింది. మండలంలోని రాగంపేట పంది వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాగంపేట, రేవెల్లె ,పెద్ద కురుమ పల్లె గ్రామాలకు వరదలు రాకపోకలు నిలిచిపోయాయి .మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేయడంతో ప్రజలు అత్యవసర సమయాల్లో తప్ప అనవసరంగా బయటకు రాకూడదని అధికారులు కోరుతున్నారు.