23న పురపాలక సంఘాల, కార్పొరేషన్ల ముట్టడి

అనంతంపురం : స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం కారణంగా ఎక్కడికక్కడ సమస్యలు రాజ్యమేలుతున్నాయని సీపీఐ రాష్ట్రనేత రామకృష్ణ విమర్శించారు. పురపాలక సంఘాల్లో, నగరల్లో మురుగు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షాలు పడినప్పుడు ప్రజలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. ప్రభుత్వ అసమర్థత వైకరి నిరసనగా 23న పురపాలక సంఘాలు, కార్పోరేషన్లు ముట్టడిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు రైతు సమస్యలపై ఆగస్టు1 నుంచి రైతు పోరుబాట, 9న ఛలో సెక్రటేరియట్‌ నిర్వహించారు.