23న రాష్ట్రపతికి ఎంపీల వీడ్కోలు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి త్వరలో పదవీ కాలం ముగస్తున్నందున రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు పార్లమెంట్ సభ్యులు జూలై 23న వీడ్కోలు పలకనున్నరు. పార్లమెంట్ సెంట్రల్ హల్‌లో ఏర్పటు చేస్తున్న వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకావాలని ప్రతిభా పాటిల్‌ను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆహ్వానించారు. ఇందుకు ఆమె అంగీకరించారు. రాజ్యసభ చైర్మెన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మీరాకుమార్, మన్మోహన్ సింగ్, అన్ని పార్టీల ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమానికి హాజరైన్నారు.



