పుట్ట మధూకర్ పొలిటికల్ బయోడాటా….
పేరు: పుట్ట మధూకర్
తండ్రి పేరు: రాయలింగు
తల్లి పేరు: లింగమ్మ
భార్య: శైలజ
పిల్లలు: శ్రీహర్ష, మౌమిత
పుట్టినరోజు: 01-04-1972
పుట్ట మధు రాజకీయ ప్రస్థానం మంథని ప్రభుత్వ హైస్కూల్ అధ్యక్షునిగా ప్రారంభం అయింది. 10 వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ లో చేరిన ఆయన మద్యలోనే ఆయన చదువును మానేసి పూర్తిస్థాయిలో రాజకీయాల్లో చేరి నీటి సంఘం చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2001లో ఎంపీటీసీ గా ఎన్నికై మంథని ఎంపీపీగా నియమితులయ్యారు. 2006 లో మంథని జెడ్పీటీసీగా 5 వేల మెజారిటీతో గెలిచారు. 2009 లో ప్రజారాజ్యం పార్టీ నుండి మంథని ఎమ్మెల్యేగా పోటీ చేసి 50 వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఓటమి తర్వాత 2010 లో తన తల్లి పేరిట పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. 2014 లో టీఆరెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి 19 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం ట్రస్ట్ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ 220 సామూహిక వివాహాలు జరిపించి చరిత్ర సృష్టించారు. 2018 లో ఎమ్మెల్యేగా ఓటమి పాలయినా జిల్లాపరిషత్ చైర్మన్ గా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోనే మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించగా 2019 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కమాన్ పూర్ జెడ్పీటీసీగా 5 వేల పైచిలుకు మెజారిటీతో ఎన్నికై పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ గా నేటికీ కొనసాగుతూ ప్రజల మద్యలో ఉంటూ ప్రజా సేవకే అంకితమయ్యారు.