వీణవంక లో చిరు వ్యాపార స్తులకు 48 షాపులకు గ్రామపంచాయతీ స్థలాన్ని కేటాయించినగ్రామ సర్పంచ్   నీల కుమారస్వామి

వీణవంక సెప్టెంబర్ 13 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ లో భాగంగా, ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారస్తులకు బుధవారం వీణవంక గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి మానవత దృక్పథంతో ఆలోచించి, ముందస్తుగా తాత్కాలికంగా వీణవంక గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో చిరు వ్యాపారస్తులకు 48 షాపులకు ప్రభుత్వ గ్రామపంచాయతీ ,స్థలాన్ని వారికి కేటాయించి, చిరు వ్యాపారస్తుల సమక్షంలో డ్రా పద్ధతిన స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామితో పాటుగా, వార్డు మేంబర్లు మొండయ్య, తాళ్లపల్లి మహేష్. నాయకులు నీల పున్నం చందర్ , రవి, సురేష్, శ్రీనివాస్, షాపుల యజమానులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఎండి నిజాం. ఆదిమూర్తి. గెల్లు సమ్మయ్య. తోపాటు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు