ఈనెల 17న తుక్కుగూడ లో జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి జయప్రదం చేయండి భువనగిరి మండల్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి

భువనగిరి రూరల్ సెప్టెంబర్ 15 జనం సాక్షి):–టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు మేరకు
ఈనెల 17న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి బోనగిరి మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు పిలుపునిచ్చారు .శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సి డబ్ల్యూ సి సమావేశాలు ఈనెల 16 17 18 తేదీలలో మూడు రోజులపాటు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నందున సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కరిగే తోపాటు దేశంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లు సీఎల్పీ నాయకులు మంత్రులు మాజీ మంత్రులు సిడబ్ల్యుసి సభ్యులు హాజరు అవుతున్నందున 17వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు సూచించారు భువనగిరి యాదాద్రి జిల్లాలోని అన్ని మండలాల నుండి వేలాది సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు సూచించారు విజయ భేరి సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని వారు పేర్కొన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతున్న బి ఆర్ ఎస్ బిజెపి పార్టీలను గద్దె జింపే సమయం ఆసన్నమైందని వారు జోష్యం చెప్పారు బి ఆర్ఎస్ బిజెపి లు కొమ్ముకై దేశాన్ని ఒకరు రాష్ట్రాన్ని ఒకరు దోచుకు తింటున్నారని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతం అవుతుందని త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు.

తాజావార్తలు