చలో తుక్కుగూడ విజయభేరి బహిరంగ సభను జయప్రదం చేయండి నవాబుపేట కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్

వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి
నేడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరగబోయే విజయభేరి బహిరంగ సభను భారీ సంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని సిడబ్ల్యుసి సమావేశాలు విజయభేరి బహిరంగ సభ జరుగనున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్ర హారాలు మానాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు విజయభేరి సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుణపడం చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు ఆదివారం జరిగే విజయబెరీ భారీ బహిరంగ సభకు తెలంగాణ తల్లి సోనియా గాంధీ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున కరిగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన సూచించారు